Suicide: ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ అనే మహిళకు తమిళనాడుకు చెందిన హుస్సేన్‌తో వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య కలహాలతో ముగ్గురు పిల్లలతో కలసి దిల్షాద్ విజయపురం మండలంలోని తన అమ్మగారింటికి వచ్చేసింది.
Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
ఈ మధ్యలో అశోక్ కుమార్ అనే యువకుడు పరిచయమై ప్రేమగా మారడంతో పిచ్చటూరు మండల కేంద్రంలో ఓ ఇల్లు తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇంతలో అశోక్ భార్యకు డెలివరీ టైం కావడంతో అతను భార్య వద్ద ఉంటున్నాడు. నాలుగు రోజుల నుండి దిల్షాన్‌తో అశోక్‌కుమార్ మాట్లాడలేదు. ఈ క్రమంలో అశోక్ మాట్లాడలేదని మనస్థాపానికి గురైన దిల్షాద్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వారిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
