రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఉద్యోగం మానేసిందన్న కారణంతో పాత యజమాని.. ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుని మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో అడ్డువచ్చిన ఆమె కుమారుడు కూడా గాయపడ్డాడు. జల్నాలోని శుక్రవారం రాత్రి రామ్‌నగర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
ఇది కూడా చదవండి: Paul Stirling: పాక్ జట్టును ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్.. అసలు మ్యాటరెంటంటే..
మహారాష్ట్రలోని జల్నాలో సుభిద్ర వైద్య అనే 40 ఏళ్ల మహిళ ఓ రెస్టారెంట్‌లో పని చేసి మానేసింది. అయితే తిరిగి ఉద్యోగంలో చేరాలని పాత యజమాని గణేష్ కటక్డే(45).. ఇంటికి వచ్చి గొడవ చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. ఉద్యోగంలో చేరడానికి నిరాకరించింది. దీంతో అతడు ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో నిందితుడు ఈ ఘాతునికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy : ఇండియాకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి
బాధితురాలు సుభిద్రా వైద్య ఇటీవలే నిందితుడి రెస్టారెంట్‌లో ఉద్యోగం మానేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ పనిలోకి రావాలని అతడు వేధిస్తూనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. కటక్డే మద్యం మత్తులో వైద్య ఇంటికి వచ్చి ఆమెను తిరిగి పనికి రమ్మని అడిగాడు. ఆమె నిరాకరించడంతో.. అతను ఆమెపై కత్తితో దాడి చేశాడని అధికారి తెలిపారు. మహిళ కుమారుడు సచిన్ (20) కూడా ఆమెను రక్షించడానికి ప్రయత్నించి గాయపడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిపై మౌజ్ పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 200 మంది మృతి