Site icon NTV Telugu

Drinking Alcohol: గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించినందుకు మహిళ హత్య

Gurudwara

Gurudwara

Woman shot dead for drinking alcohol on Patiala gurdwara premises: పంజాబ్‌లోని పాటియాలాలోని దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవించినందుకు ఒక మహిళను కాల్చి చంపారు. పర్మీందర్ కౌర్ అనే మహిళ సరోవర్ సమీపంలో మద్యం సేవిస్తుండగా, ఆదివారం సాయంత్రం గురుద్వారా అటెండర్ ఆమెను గుర్తించాడు.అటెండర్సాగర్ మల్హోత్రా ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. అతను ఆమెను గురుద్వారా మేనేజర్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ మరొక అటెండర్‌ ఆమెను కాల్చాడు. పర్మీందర్ కౌర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

Read Also: Hyderabad: హైదరాబాద్‌ లో విషాదం..ఓ ప్రేమ జంట ఆత్మహత్య

సాగర్ మల్హోత్రా కూడా కాల్పుల్లో గాయపడి పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పర్మిందర్ కౌర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుబక్ష్ కాలనీలో నివాసముంటున్న పర్మీందర్ కౌర్ అవివాహితురాలు. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version