Crime News: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లల్ని చూసేందుకు ఇంటికి వచ్చిన భార్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బావాజీ అలియాస్ బాబ్జీ (33)కు కొంతకాలం క్రితం మదనపల్లెకు చెందిన యాస్మిన్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బాబ్జీ స్థానికంగా చికెన్ సెంటర్‌లో పనిచేస్తాడు. కుటుంబ కలహాలతో కొంతకాలం క్రితం భార్యాభర్తలు విడిపోయారు. పదిరోజుల క్రితం విడాకులు తీసుకున్నారు.
Read Also: Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్!
గురువారం రాత్రి మదనపల్లె డ్రైవర్స్ కాలనీలో ఉంటున్న యాస్మిన్ వద్దకు బాబ్జీ వెళ్లాడు. పిల్లలను చూసేందుకు వచ్చానని చెప్పగా భార్య ఆమె కుటుంబ సభ్యులు అతడ్ని అడ్డుకున్నారు. బిడ్డలను కూడా చూడనివ్వరా బాబ్జీ ప్రశ్నించగా… యాస్మిన్ కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకుని అతనిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. మంటలు అంటుకుని రక్షించాలని అతడు కేకలేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో మదనపల్లె 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాబ్జీకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
