Site icon NTV Telugu

Crime News: దారుణం.. పట్టపగలే తుపాకీతో మహిళను బెదిరించి మరీ..

Download

Download

Crime News: ఘజియాబాద్‌లో పట్టపగలే రాబరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం లోని ఏరియాలో ఓ మహిళను యువకుడు తుపాకీతో బెదిరించి ఆమె దగ్గరున్న సొమ్మును దోచుకెళ్లాడు. ప్రముఖ వార్తా సంస్థ షేర్ చేసిన వీడియోలో, నిందితుడు తన చేతిలో తుపాకీతో మహిళకు పాయింట్ బ్లాంకులో పెట్టినట్లు కనిపిస్తోంది. అతను మొదట గొలుసును వదులుకోమని మహిళను ప్రేరేపించాడు. నిందితుడిని ప్రతిఘటించిన ఆమె కొడుకు సెల్ ఫోన్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే చలి ఎక్కువగా ఉండడంతో ఓ మహిళ ఇంటిముందు ఎండలో నిలబడి ఉంది. అటుగా వచ్చిన నిందితుడు ఆమెకు గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై లోని డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) రజనీష్ కుమార్ ఉపాధ్యాయ స్పందించారు. లోని పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి ఒక స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. నిందితుడిని ఇంకా గుర్తించాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.

Exit mobile version