NTV Telugu Site icon

Viral News: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే.. బాస్ అలా అన్నాడు..!

Duty

Duty

ఈ రోజుల్లో ఉద్యోగం లేక రోడ్లపై తిరిగే జనాలు చాలామంది కనిపిస్తారు. కొన్నిసార్లు ఉద్యోగం సంపాదించడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనపడుతాయి. మన లైఫ్ లో కూడా అలాంటి రోజులు ఉండే ఉంటాయి. ఐతే ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వదిలేస్తే.. ఆ పరిస్థితులు వేరేలా ఉంటాయి. చాలా సార్లు ఇతర కంపెనీల నుంచి మంచి ఆఫర్లు రావడం, ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోవడం.. లేదా బాస్ తో పడక ఉద్యోగం మానేయడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక కేసు అలాంటిదే జరిగింది. ఉద్యోగంలో చేరిన ఓ మహిళ.. 3 రోజులకే మానేసింది. ఆ విషయానికి సంబంధించిన పోస్ట్‌ను రెడ్డిట్‌ లో షేర్ చేసింది. కంపెనీలో తనకు ఏమి జరిగిందో మొత్తం చెప్పింది. అయితే ఆ మహిళ ఉద్యోగం మానేసినందుకు గాను.. పలువురు ప్రశ్నించారు. ఏదైనా తప్పు చేశారా.. ఎందుకు మానేయాల్సి వచ్చిందని అడిగారు. అయితే ఉద్యోగం మానేయడానికి ఆ మహిళ చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది.

Manipur: మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య

మొదట బాస్ తనతో మాట్లాడుతూ.. మీరు పని చేయలేరు. టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని చెప్పినట్లు ఆ మహిళ చెప్పింది. అంతేకాకుండా చాలా మానసికంగా కుంగిపోయావు అన్నాడని తెలిపింది. ఒక యజమాని ఉద్యోగితో మాట్లాడే విధానం ఇదేనా అని మనసులో ఫీల్ అయింది. వాస్తవానికి తనకు బాస్ ఏ పని ఇవ్వలేదని.. ఆ కంపెనీలో పనిచేసే సహోద్యోగి పని ఇచ్చాడని తెలిపింది.

Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?

టాయిలెట్ లో 10 నిమిషాలకు పైగా గడిపిన విషయంపై ఆ మహిళ ఏమన్నదంటే.. తనకు మలబద్ధకం ఉందని, తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పింది. అయితే తన యజమాని తన గురించి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదని పేర్కొంది. నువ్వు ఉద్యోగం చేయడానికి సరిపోవని బాస్ తనతో చెప్పినప్పుడు, దానికి ఆ మహిళ వెంటనే రాజీనామా చేసింది.