Woman Protest: నెల్లూరు జిల్లాలోని వింజమూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఓ మహిళ ఆందోళన చేపట్టింది. తమను నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారే తప్పా.. కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ వివాహం జరిగిన అనంతరం ఒక పాప పుట్టినప్పటి నుంచి భర్త ముజీద్ హింసిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. దంపతులు ముజీద్, అఫ్రీన్‌లు సుజాతనగర్‌లో మూడేళ్లుగా నివాసముంటున్నారు. భార్యను వదిలేసి భర్త ముజీద్ రెండేళ్ల క్రితం సౌదీకి వెళ్లిపోయాడు. సౌదీ నుంచి ఈ మధ్య వచ్చిన అతను గంగమిట్టలోని తల్లిదండ్రుల నివాసంలో ఉంటున్నాడు.
భర్త సౌదీలో ఉన్నప్పుడు తన భర్త తమ్ముడు , వారి ఫ్రెండ్స్ తమతో ఉండాలని.. లేదంటే చిత్ర హింసలు పెడతామని చెప్పినట్లు ఆమె ఆరోపణలు చేశారు.ఆదివారం అఫ్రీన్ ఉంటున్న ఇంటిని కూలదోసి , రక్తం వచ్చేలా భర్తతో పాటు నలుగురు వ్యక్తులు కొట్టారని ఆమె చెప్పింది. మెకానిక్ రసూల్ అనే వ్యక్తి ఎస్సైకి సన్నిగితంగా ఉంటూ మూడేళ్ళుగా కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తమని ఇబ్బంది పెట్టే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
