NTV Telugu Site icon

Jana Sena: జనసేన తిరుపతి ఇంఛార్జిపై మహిళ ఆరోపణలు.. పార్టీ కీలక నిర్ణయం..

Janasena

Janasena

జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేయడం, వీడియోలు బయటకు రావడం సంచలన రేపాయి‌‌.2013 లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని కాని ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారంటూ తిరుపతి పోలీసులు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు‌‌‌‌‌.. ఈ క్రమంలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నిరోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి పరిశీలన జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు.

READ MORE: Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్‌తో మాట్లాడాను: ట్రంప్..

అలాగే పార్టీ ఆదేశాలు వచ్చే వరకూ జనసేన పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని.. సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కనబెట్టాలని జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నేతలకు పపన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పాని తాను చేస్తుందని స్పష్టం చేశారు.

READ MORE: Mahesh Kumar Goud: కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలు.. టీపీసీసీ అధ్యక్షుడు కౌంట‌ర్