తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Read Also: Sexual Assault : సుల్తాన్ బజార్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీనా(25), ప్రియుడు రవికుమార్ ప్రేమించుకున్నారు. అయితే.. రమేశ్ రెతువా (27) అనే వ్యక్తితో రీనాకు పెళ్లి అయింది. రీనాకు రమేశ్ తో ఉండటం ఇష్టం లేక.. గత వారం ప్రేమికుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. కాగా.. భర్త రమేష్ రెతువా తన సహచరులతో కలిసి వెతికి బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం భార్యను, ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి భర్త చితకబాదాడు.
Read Also: Jyothi: అద్దెకి ఇల్లు కూడా దొరకలేదు.. రెండేళ్ల బాబుతో రోడ్డు మీదే.. నటి ఎమోషనల్!
అయితే.. తన భర్తతో ఉండటం ఇష్టం లేదని, అందుకే ప్రియుడితో కలిసి వెళ్లినట్లు రీనా తెలిపింది. ఈ క్రమంలో.. భర్త రమేష్, అతని సహచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రమేష్‌ను గురువారం అరెస్టు చేసి మరో ఏడెనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
