రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు రక్షించారు. అర్ధరాత్రి సమయంలో, బెంగళూరుకు చెందిన ఒక మహిళ RGI ఎయిర్‌పోర్ట్ డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్‌ను దాటింది. దూకడానికి ప్రయత్నిస్తుండగా CISF సిబ్బంది ఆమెను పట్టుకుని సురక్షితంగా వెనక్కి లాగారు. ఆ తర్వాత మహిళను ఓ గదికి తరలించి, కొద్దిసేపు ఉంచిన తర్వాత సీఐఎస్‌ఎఫ్ స్థానిక అధికారులకు అప్పగించింది.
Also Read : Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి విమానాశ్రయంలో శ్వేత అనే యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన సీఐఎస్ ఎఫ్ అధికారులు యువతిని రక్షించారు. భర్త విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే.. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే యువతి ఆత్మహత్యా యత్నం చేసినట్లు సమాచారం.
Also Read : NCP: అజిత్ పవార్‌కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
