ఈ మధ్య ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ సంచలనాత్మక కేసు బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమునా గ్రామానికి చెందినది.
పోలీసులు కథనం ప్రకారం.. జూన్ 21న పొలంలో బిక్కు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి. అతడు హత్యకు గురైనట్లు గాయాల ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పలు ఆధారాల కారణంగా పోలీసులు భార్య పూజను అనుమానించారు. ఆ మహిళను ఇంటెన్సివ్ విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె మొత్తం కుట్రను వెల్లడించింది.
జూన్ 25న ఆ మహిళను అరెస్టు చేసినట్లు దౌండ్‌నగర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కుమార్ రిషిరాజ్ తెలిపారు. విచారణలో ఆమె తన ప్రేమికుడు కమలేష్ యాదవ్ తో కలిసి తన భర్త హత్యకు ప్లాన్ చేసి అమలు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించారు. అయితే, హత్య ఎలా జరిగిందో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం నిందితురాలు పోలీసు కస్టడీలో ఉంది. ప్రస్తుతం ఆమె ప్రేమికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. త్వరలో అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే.. కారుతో గుద్ది చంపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
READ MORE: Adah Sharma : అద్దె ఇంట్లో అవస్థలు పడుతున్న పూరీ హీరోయిన్..!
స్థానికుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా వివాదం నెలకొంది. ఆ మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. తన భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. కాగా.. త్వరలోనే హత్యకు సంబంధించిన కుట్ర పూర్తిగా బయటపడతుందని పోలీసులు చెబుతున్నారు.
