Wife Killed Husband: వారికి పెళ్లై 15 సంవత్సరాలు. అందమైన కుటుంబం. పిల్లలతో కళకళలాడుతూ ఉండే ఇల్లు. అంతా బాగానే ఉంది ఆ భర్త. భార్య కూడా అలానే నమ్మిస్తూ వచ్చింది. తనకు కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదని. అయితే ఈ మధ్య ఇలాంటి కథలే ఎక్కువైపోతున్నాయి. నమ్మిన భర్తనే నట్టేటా ముంచేస్తున్నారు కొంతమంది భార్యలు. పరాయి మగవాళ్ల మోజులో మొగుడినే మట్టుబెడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి విషయాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కేవలం మోసం చేయడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు కూడా తీస్తున్నారు. సమాజం, మానవత్వం, పిల్లలు, కుటుంబం ఇలా వేటి గురించి కూడా ఆ మహిళలు ఆలోచించడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటే వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల నుంచి తాను సాగిస్తున్న అక్రమసంబంధం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి అతడిని చంపేసింది ఓ మహా ఇల్లాలు.
Also Read: Cyber Crime: నటికి టోకరా.. సెకన్లలో లక్ష నొక్కేశారు
వివరాల ప్రకారం రాజస్తాన్ లోని భరత్‌పూర్ జిల్లా భదిరా గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఆమెకు 15 ఏళ్ల నుంచి చెల్లెలి వరుస అయ్యే ఒకావిడ భర్తతో అక్రమ సంబంధం ఉంది. అయితే ఈ మధ్యనే భర్తకు అవిషయం తెలిసి తట్టుకోలేకపోయాడు. దీంతో రోజూ తాగి వచ్చి ఆమెను తిడుతూ, కొడుతూ ఉండేవాడు. ఇక అతని చేష్టలతో విసిపోయిన ఆ మహిళ తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా తన ప్రియుడికి సమాచారం అందించింది. ఇద్దరూ కలిసి రాత్రి పూట ఆమె భర్త నిద్రిస్తూ దిండుతూ ఊపిరాడకుండా చేసి చంపేశారు. తెల్లారాక దాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన వారి కొడుకు తన తండ్రి మరణం సహజంగా జరగలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు భార్య అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో చనిపోయిన వ్యక్తి భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు నిజాలు బయటపెట్టేలా చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.