HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
- నమ్మి పనిలో పెట్టుకుంటే
- ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది
- ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఆ ఇంటికే కన్నం వేసింది.. ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది. పని మనిషి రూపంలో వచ్చి.. మర్డర్‌కు పాల్పడిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాగిలాపూర్ వృద్ధురాలి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మర్డర్ జరిగిన 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసిన పనిమనిషి కవిత. చర్చి గాగిలాపూర్‌లో వృద్ధురాలు సుశీలమ్మ హత్య కేసులో గతంలో ఆమె ఇంట్లో పనిచేసిన పనిమనిషి కవితే కారణమని పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి నేతృత్వంలో సాగిన దర్యాప్తులో నిందితురాలు హత్యకు సంబంధించిన కీలక విషయాలను ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
గతంలో సుశీలమ్మ ఇంట్లో.. కవిత పనిమనిషిగా పని చేసింది. ఐతే కొన్ని కారణాలరీత్యా పని మానేసింది. ఐతే మళ్లీ సుశీలమ్మ ఇంటికి వచ్చి ఆమెను మాటల్లో పెట్టింది. ముందుగా ఆమెకు కల్లు తాగించి మద్యం మత్తులోకి నెట్టింది. ఆ తర్వాత సోఫాకు ఉండే చెక్క భాగానికి సుశీలమ్మ తలను బలంగా మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికీ ఆమె చనిపోలేదని అనుమానించిన కవిత.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది…
హత్య అనంతరం సుశీలమ్మ చెవులకు ఉన్న కమ్మలు, ముక్కుపుడకను అపహరించిన కవిత.. ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లింది. మొబైల్ ఫోన్ ఆన్‌లోనే ఉండటంతో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించింది కవిత. కానీ అది రాకపోవడంతో తన ఇంటి సమీపంలో మట్టిలో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆ మొబైల్‌ను గుర్తించి కీలక ఆధారాలను సేకరించారు.
Also Read:YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
మరోవైపు దొంగిలించిన బంగారాన్ని ఓ జ్యువెలరీ షాపులో కరిగించేందుకు ఇచ్చినట్లు కూడా కవిత ఒప్పుకుంది. షాపు యజమానితో మాట్లాడిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. ఆమె ఇంటికి సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు.. అనుమానితురాలి కదలికల ఆధారంగా కవితను అదుపులోకి తీసుకున్నట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!