Facebook: ఫేస్‌బుక్ లైవ్ పెట్టి.. ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మరీ ఉరేసుకుని చనిపోయింది. సనా అనే మహిళ.. హేమంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన అత్తమామలు ఆమెను తరచూ వేధించడం మొదలు పెట్టారు. అది చాలదన్నట్టు భర్త హేమంత్ సైతం మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. సనా ముస్లిం కాగా ఆమె భర్త హిందువు. హేమంత్ తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని మతం మారి సనాను పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది మరి సనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? హేమంత్‌కి వేరొకరితో ఉన్న అనుబంధమే సమాధానం. ఈ విషయం హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చెబుతున్నారు. సనాకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
Read Also:Maa Awara Zindagi Review: బిగ్ బాస్ శ్రీహాన్ ‘మా ఆవారా జిందగీ’ రివ్యూ
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
సనా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్ నాలుగేళ్ల క్రితం తమ ఇంటికి వచ్చాడు. తాను ముస్లింగా మారి సనాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అతను తన పేరును కూడా హేమంత్ నుండి షంషేర్ గా మార్చుకున్నాడు. కుటుంబం సభ్యులు చెప్పిన ప్రకారం ఓ ఏడాది పాటు అంతా బాగానే ఉంది. కానీ 5 నెలల నుంచి వేధింపులు భరించి భరించి విసుగు చెందిన సన ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి తన బాధనంతా వివరించింది. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also:Posani Krishna Murali: పవన్ ఒకప్పుడు చాలా మంచి వాడు.. మాయలో ఎందుకు పడ్డాడో..!
అతను సోఫీ ఖాన్ అనే అమ్మాయితో ఎఫైర్ ప్రారంభించాడు. అతని దగ్గర సంగీతం నేర్చుకోవడానికి సోఫీ వచ్చేది. సనా అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో హేమంత్ ఆమెను మానసికంగా హింసించడం ప్రారంభించాడు. సనా ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సనా ఫోన్‌లో హేమంత్, సోఫీ ఖాన్‌లతో ఆమె చేసిన చాట్‌లపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమాచారం ప్రకారం సనా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పనిచేసేది. పెళ్లి తర్వాత ఇద్దరూ ఢిల్లీకి వెళ్లిపోయారు. అతను కరోనా సమయంలో తిరిగి వచ్చినప్పుడు, హేమంత్ సోఫీ ఖాన్ అనే అమ్మాయితో ఎఫైర్ ప్రారంభించాడు. ఆ సమయంలో సనా గర్భవతి. సన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు హేమంత్ పలకరించేందుకు కూడా రాలేదు. సనా రాజస్థాన్ వెళ్లి తన అత్తమామలతో మాట్లాడిందని, అక్కడ హేమంత్ ఆమెను కొట్టాడని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?