Site icon NTV Telugu

Bihar: పెళ్లి వేడుకలో మైక్‌ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?

Bihar

Bihar

Bihar: పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాట పాడుతూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మహిళ పాడుతున్న మైక్‌లో కరెంట్ ప్రవాహం పెరగడంతో ఆమె మరణానికి దారితీసింది. రోసాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మబ్బి గ్రామంలో వివాహానికి హాజరయ్యేందుకు పలువురు మహిళలు తరలివచ్చారు. వేడుకల మధ్య మీనా దేవి మైక్రోఫోన్‌లో పాడటం ప్రారంభించింది. అకస్మాత్తుగా, మైక్రోఫోన్ పనిచేయలేదు. దాని ద్వారా కరెంట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. మీనా దేవి మైక్‌ పట్టుకుని అలాగే కుప్పకూలింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్‌ పెట్టిన ప్రియుడు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మీనాదేవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళ మృతికి మైక్రోఫోన్ ఎలా పని కారణమైందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version