కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు.. విషయం తెలుసుకున్న కల్లు కాంపౌండ్ ఓనర్ గుట్టు చప్పుడు కాకుండా బయటకి రాకుండా యత్నించారు. అంత్యక్రియలు చేసేందుకు స్వరూప మృతదేహాన్ని కొడుకు, కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కల్తీ కల్లు తాగే మరణించిందని కేపీహెచ్‌బీ (KPHB) పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు వెంటనే అంత్యక్రియలు జరుగుతున్న స్పాట్‌కి చేరుకున్నారు. అంత్యక్రియలను మధ్యలోనే ఆపేశారు. స్వరూప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. స్వరూప కొడుకు దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: AP Assembly Session 2025: ఆగష్టు రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సంగతేంటి?
