Faith In Astrology: కొంతమందికి జ్యోతిష్యం అంటే పిచ్చిగా నమ్ముతారు. అలా నమ్మేవారికి నక్షత్రాలు, తిధులు, గ్రహాలు వంటి ప్రతిదానిపై వారికి విశ్వాసం ఎక్కువగానే ఉంటుంది. జ్యోతిష్యంలో చెప్పినవి అన్నీ నిజ జీవితంలో జరుగుతాయని బలంగా నమ్మేస్తారు. జ్యోతిష్యులు ఏం చెబితే అదే జరగుతుందని నమ్మేస్తారు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ లో రోజూ జ్యోతిష్యం గురించి విన్న ఆ గృహినికి నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆందోళనకు గురైంది. ఈ విషయం పదే పదే భర్తకు చెప్పడంతో కోపంతో రగిలిపోయిన భర్త జ్యోతిష్యం గుడ్డిగా నమ్మవద్దని వాదించిన వినలేదని ఆమెపై చెయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమో చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అంబర్ పేట్ లో చోటుచేసుకుంది.
Read also: Pawan Kalyan: ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు.. చంద్రగిరిలో లక్షకు పైగానే..!
హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన బబిత(28)కు బలరాంకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. బబిత, రామకృష్ణ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఇంట్లో ఘనంగా జరిగాయి. బంధువులందరూ వేడుకకు హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులతో గొడవల కారణంగా వారు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. రెండు గంటల తర్వాత అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న తల్లిని చూసి దిగువ పోర్షన్‌లో ఉంటున్న బాబాయికి చెప్పింది. పైకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
కిందకు దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న బబిత తల్లిదండ్రులు రామకృష్ణపై దాడి చేశారు. అదనపు కట్నం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అలాంటిదేమీ లేదని.. జ్యోతిష్యంపై నమ్మకం వద్దని బబితను రామకృష్ణ పదే పదే కోరినట్లు అత్తమామలు తెలిపారు. దీనిపై ఇటీవల గొడవ జరిగిందన్నారు. సహనం కోల్పోయిన రామకృష్ణ ఆమెను అందరి ముందు కొట్టాడు. దాంతో బబిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Mohammed Shami: అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ!