Site icon NTV Telugu

Trending News: ఒక ఇంజక్షన్కు బదులు మరొక ఇంజక్షన్.. శాశ్వతంగా ఇక లేనట్టే..!

Sudi

Sudi

భూమ్మీద ప్రాణాలను రక్షించే దేవుడని ఒక్క డాక్టర్ ను మాత్రం అంటారు. ఎందుకంటే ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిలా ప్రాణాలు కాపాడుతాడు. దీంతో అతన్ని భగవంతుడిలా పోలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో రోగి పరిస్థితి విషమించడం వల్ల కొందరు రోగులు చనిపోతుంటారు. దీంతో మీరే చంపేశారంటూ కొందరు జనాలు డాక్టర్లపై విరుచుకుపడుతారు. దీనివల్ల డాక్టర్లకు ఓ మచ్చలా మిగులుతుంది. అంతేకాకుండా.. కొన్నిసార్లు వైద్యులు ఒక ఇంజక్షన్ కు బదులు మరొక ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా రోగుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ఇంజక్షన్ కు బదులు మరొక ఇంజక్షన్ ఇచ్చాడు ఓ వైద్యుడు.

Glenn McGrath: వన్డే వరల్డ్ కప్లో సెమీస్కు చేరుకునే టీమ్లు ఇవే..!

వివరాల్లోకి వెళ్తే.. ఫిలడెల్ఫియాలోని ఒక వైద్యుడు అనుకోకుండా ఒక మహిళకు ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె తల్లి కావాలనే కల శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. కొన్ని నివేదికల ప్రకారం.. మాంసాన్ని కాల్చే యాసిడ్ ఇంజెక్ట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టరని ఆ మహిళ పేర్కొంది. 33 ఏళ్ల ఆ మహిళ పేరు క్రిస్టీన్‌.. ఈ ఘటన 2022లో జరిగింది. పెన్సిల్వేనియాలోని ఫెర్టిలిటీ సెంటర్‌లో టెస్టులు చేయించుకునేందుకు వెళ్లిన మహిళకు.. వైద్యుడు అలిసన్ బ్లూమ్ సెలైన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అందులో ఒక ఇంజక్షన్ కు బదులు మరో ఇంజక్షన్ ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ కలిపాడు. దీంతో ఆ మహిళ నొప్పి మరియు మంటగా ఉందని తెలిపింది.

E-Cigarettes : కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్న స్కూల్ పిల్లలు

అంతేకాకుండా మహిళ తొడలు, కాళ్ళపై ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏం జరిగిందా అని పరిశీలిస్తే.., డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్‌లో ఎక్కువగా యాసిడ్ ఉందని తేలింది. దానివల్ల క్యాన్సర్ మరియు పునరుత్పత్తికి హానికరంగా మారింది. అంతేకాకుండా.. దానివల్ల చర్మం మంట, కళ్ళకు హానికరం ఏర్పడిందని వైద్యులు చెప్పారు. వెంటనే ఆ మహిళను బర్న్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందిన మహిళ కొన్ని రోజుల తర్వాత కోలుకుంది. అయితే ఆ ఇంజక్షన్ వల్ల క్రిస్టీన్ తల్లి కాకుండా పోయింది. దీంతో ఆమే, తన భర్త డాక్టర్ పై దావా వేశారు. అంతేకాకుండా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Exit mobile version