NTV Telugu Site icon

Two Women Fight : మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు మహిళలు

Two Womens Fight

Two Womens Fight

సాధారణంగా మహిళలు గొడవ పడటానికి పెద్దగా గొడవలు అవసరం లేదు. అయితే సీటు కోసం కూడా గొడవ పడగలరు. ఆ గొడవను ఎంత దూరమైన తీసుకు వెళ్లగలరు. తాజాగా ఇద్దరు మహిళలు కేవలం సీటు కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే.. ఒకరిపై మరొకరు పెప్పర్ స్ప్రే కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ సంఘటన ఢిల్లీ రైలులో చోటు చేసుకుంది.

Read Also : Guidelines for Gold : ఒక వ్యక్తి తన ఇంట్లో ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చంటే..

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో కోచ్ లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఇద్దరు మహిళలు సీట్ల కోసం కొట్టుకోవడం స్పష్టంగా కనపడుతుంది. ఎరుపు రంగు సల్వార్ సూట్ ధరించిన మహిళ అదే వరుసలో కూర్చున్న మరో మహిళపై అరవడంతో క్లిప్ ప్రారంభమవుతుంది. ఎరువు రంగు సూట్ ధరించి ఉన్న స్త్రీ గట్టి గట్టిగా అరుస్తోంది. పెప్పర్ స్ప్రేతో తనపై దాడి చేయమని ఆమె సహా ప్రయాణీకురాలిని కూడా బెదిరించింది. అవతలి మహిళ కూడా తిరిగి మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె ఒక సీసా తీసి పెప్పర్ స్ప్రేని ఉపయోగిస్తుంది. సదరు మహిళ పెప్పర్ స్ప్రే ఎఫెక్ట్ తో.. ఆ కోచ్ లో ఉన్నవారందరూ దగ్గుతో ఇబ్బంది పడ్డారు.

Read Also : Donald Trump: అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఏకం అవుతున్నాయి.. అణుయుద్ధం జరగొచ్చు..

ఈ వీడియోకు బాగానే కామెంట్స్ రావడంతో దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కూడా స్పందించింది. హాయ్ ఎవరైన దయచేసి కోచ్ నంబర్ ను చెప్పండి.. రైలు.. లోపల, వెలుపల ఉన్న నెంబర్ చెప్పాలని కోరింది. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై విభిన్న రకాల కామెంట్స్ వస్తున్నాయి.

Show comments