Woman Assaulted: భార్యభర్తల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలు నీళ్లలా కలిసి ఉంటారు. ఒకరికి ఒకరు తోడునీడగా కష్ట సుఖాల్లో కలిసి జీవిస్తారు. కానీ ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు కలహాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్నారు. నిత్యం గొడవలు, వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది వివాహబంధానికి తీరని మచ్చ తెస్తున్నారు. పవిత్రమైన బంధానికి దూరమవుతున్నారు. కొంత తమ వికృత చేష్టలతో తమ భాగస్వాములు అసహ్యించుకునేవరకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగింది.
బికనీర్‌లోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి తన భార్యను అదే హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆ హోటల్‌లోని గదిలో ఆమెను రెండు రోజుల పాటు బంధించి.. అనంతరం మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో ఆమె దగ్గరకు వెళ్లాడు. తనకు పరిచయమున్న ఓ జంటతో కలిసి వైఫ్ స్వాపింగ్ గేమ్ ఆడుదామని అన్నాడు. దీంతో ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. స్వాపింగ్ గేమ్ అంటే భార్యలను మార్చుకుని శృంగారంలో చేయడం. అందుకు ఆమె ససేమిరా ఒప్పుకోకుండా ఎదురుతిరగింది. అతను ఆమెను భయపెట్టినా బెదరకుండా అతనిని ఎదిరించింది. దాంతో ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా తీవ్రంగా కొట్టాడు.
PM KISAN Samman Nidhi: రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు
ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటి వారితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని, అబ్బాయిలతో శృంగారం చేసే అలవాటు కూడా ఉందని తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా అత్తింటి వారు రూ.50 లక్షల కట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడితో పాటు అతని తల్లిని, సోదరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు.