PM KISAN Samman Nidhi: దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 12వ విడత నిధులు విడుదలయ్యాయి. దేశ రాజధానిలో రెండు రోజుల పాటు జరగనున్న పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సదస్సును ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమావేశం వేదికగా 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు రూ.16,000 కోట్ల విలువైన 12వ విడత నిధులను వారీ ఖాతాల్లో జమ చేసినట్లు ప్రధాని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తోంది. రూ. 2000 చొప్పున మూడు విడతలుగా ఈ నగదును బదిలీ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 12 సార్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. 12వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది.
‘ఒక దేశం, ఒకే ఎరువులు’ కింద రైతులకు చౌకైన, నాణ్యమైన ఎరువులు అందించబడతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధాని మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన – ఒక దేశం, ఒకే ఎరువులు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రధాన మంత్రి భారత్ యూరియా సంచులను ప్రారంభించారు. ఈ ఎరువులపై ‘భారత్’ అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులను విక్రయించడం జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.యూరియా ఉత్పత్తిలో భారతదేశం పురోగతి గమనించదగినదని కూడా ఆయన హైలైట్ చేశారు.
Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీ కండువా కప్పుకోనున్న బూర నర్సయ్యగౌడ్
భారతదేశం నానో-యూరియా వినియోగం ద్వారా యూరియా ఉత్పత్తిలో ఆత్మనిర్భర్త దిశగా కృషి చేస్తోందన్నారు. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా ఉంటుందని ప్రధాని అన్నారు. వ్యవసాయ ప్రయోజనాల కోసం నానో యూరియా తక్కువ ఖర్చుతో కూడుకున్న మాధ్యమంగా ఉద్భవిస్తుందన్నారు. అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎరువులపై ‘ఇండియన్ ఎడ్జ్’ అనే ఈ-మ్యాగజైన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఇటీవలి పరిణామాలు, ధరల ధోరణి విశ్లేషణ, లభ్యత, వినియోగం మరియు రైతుల విజయగాథలతో సహా దేశీయ, అంతర్జాతీయ ఎరువుల దృశ్యాలపై సమాచారాన్ని ఈ మ్యాగజైన్ అందిస్తుంది.