Karnataka: ఆగని దారుణాలు.. చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం
- కర్నాటకలో మరో దారుణం
- వైద్యం కోసం వచ్చిన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారం
- చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఘటన
- 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా కోల్‌కతా రేప్ ఘటనపై ఆగ్రహజ్వాలలు కనబడుతున్నప్పటికీ, మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన 65 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. బాధిత మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి రాగా.. ఆలస్యం కావడంతో రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. మహిళ ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే.. ఆమెను ఒంటరిగా గుర్తించిన నిందితుడు ఇర్ఫాన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో ఆసుపత్రిలో ఉన్న కొందరు వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. అంతేకాకుండా.. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై చిక్కబళ్లాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ చౌక్సే మాట్లాడుతూ.. మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిందని.. ఆమె ఆసుపత్రి ఆవరణలో ఉండగా ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీకి పంపామని.. భారతీయ న్యాయ సంహిత (రేప్) సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?