Wife and Husband: ఇటీవల కాలంలో భర్తలపై భార్యల దాడులు ఎక్కువయ్యాయి. క్షణికావేశంలో దాడులు చేసి తర్వాత వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. భార్యభర్తల బంధంలో కొన్ని సార్లు మనస్పర్థలు రావడం పరిపాటే. అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజీపడి కూర్చుని మాట్లాడుకుంటే సర్ధుకుంటాయి.. కానీ దాడులు చేసుకుని నష్టపరుచుకుంటున్నారు.
Read Also:NASA: దారి మళ్లిన గ్రహశకలం.. నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్
తాజాగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఓ భార్య తన భర్తపై యాసిడ్ పోసింది. చిన్న పాటి గొడవను మనసులో పెట్టుకొని భర్త ముఖంపై భార్య బాత్‌రూమ్ యాసిడ్‌తో దాడి చేసింది. ఈ సంఘటన రఘునాథపాలెం మండలంలో జరిగింది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. రేగులచెలకకు చెందిన ఉబ్బని రవి, సుజాత భార్యభర్తలు, వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి బాబును ఎత్తుకునే విష యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం లేచిన రవి పని కోసం ఖమ్మం బయలుదేరి గ్రామంలో కూడలిలో ఆటో కోసం నిలిచిఉన్నాడు. ఈ క్రమంలో సుజాత ఇంట్లోని బాత్‌రూమ్ యాసిడ్‌ను వాటర్ బాటిల్‌లో తీసుకొచ్చి రోడ్డుపై నిలిచి ఉన్న రవి ముఖం పై పోసింది. ఆయనతో పాటుగా సమీపంలోనే ఉన్న మరో వ్యక్తి కన్నెపోగు కిరణ్‌పై పడటంతో గాయపడ్డాడు. యాసిడ్‌తో దాడి చేసిన భార్యంపై భర్త రవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుజాతపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Read Also: Adani: ఇక పూర్తి స్థాయి టెలికాం సేవల్లోకి అదానీ
ఇదిలా వుంటే.. తమిళనాడు రాష్ట్రం రాణీపేట జిల్లా ఉరియూరులో మద్యం సేవించి, తనను చిత్రహింసలు పెడుతున్న భర్తపై ఆగ్రహించిన భార్య.. క్షణికావేశంలో గడ్డపారతో తిరగబడింది. ఈ దాడిలో భర్త చనిపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఉరియూన్‌కు చెందిన సీరాలన్ సౌండ్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య శోభన. ఆ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా మద్యానికి బానిసైన సీరాలన్.. ప్రతిరోజూ భార్యతో గొడవ పడడంతో పాటు ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య వివాదం నెలకొనగా.. శోభన చేతికందిన గడ్డపారతో కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. స్థానికులందించిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శోభనను అరెస్టు చేశారు.