NTV Telugu Site icon

Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..

Jk Voting

Jk Voting

గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్‌ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తద్వారా యూనియన్ టెరిటరీలో ప్రజాస్వామ్య ప్రక్రియ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శనివారం.. CEC కుమార్ మీడితో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలలో జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఓటింగ్ శాతం పెరిగిందని, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే ప్రక్రియను ఎన్నికల సంఘం అతి త్వరలో ప్రారంభిస్తుందని చెప్పారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా

లోయలోని మూడు స్థానాలు: శ్రీనగర్ లో 38.49, బారాముల్లా 59.1, అనంతనాగ్-రాజౌరీలో 54.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత మూడు దశాబ్దాల కంటే అత్యధికం. యుటిలోని రెండు స్థానాలు: ఉధంపూర్ 68.27, జమ్మూలో 72.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. ప్రజాస్వామ్యాన్ని పెద్దఎత్తున స్వీకరించారని ఎన్నికల సంఘం తెలిపింది.

Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే 18-59 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు.. UTలో అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక పోల్ శాతం ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని.. ఇది సానుకూల, హృదయపూర్వక పరిణామమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈసీ ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో 18-59 ఏళ్ల వయస్సు గల వారు 80 శాతానికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

Show comments