Heart breaking Incident: అంత్యక్రియలకు డబ్బులు లేవని మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు.
టాప్ క్లాస్ బౌలింగ్తో ఫైనల్లో గెలిపించిన బౌలర్లు
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఆమె చాలా కాలంగా కాలేయ సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని పోస్ట్‌మార్టంలో తేలిందని, దీంతో ఆమె సహజ మరణానికి దారితీసిందని ఏసీపీ తెలిపారు. అయితే.. మృతురాలు గత పదేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని పేర్కొన్నారు. రాజ్‌మొహల్లా ప్రాంతంలోని తోటలో ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మానసికంగా బలహీనంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Kalki 2898 AD: షాకింగ్ : రిలీజ్ కు ముందే ఓటీటీలోకి భైరవ?
మరోవైపు.. అంతకుముందు ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని ఏసీపీ చెప్పారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇంటి నుంచి 200 మీటర్ల దూరం తీసుకెళ్లాడు. అంత్యక్రియలకు డబ్బు లేని కారణంగా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేచినట్లు ఆ వ్యక్తి తెలిపాడన్నారు. మరోవైపు మహిళ మృతిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఏసీపీ నందిని శర్మ తెలిపారు. సోమవారం మహిళకు అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- body
- Indore
- last rites
- Man
- No money
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!