Jailer 2 : కోలీవుడ్ స్టార్ హీరో రజినీ కాంత్ హీరోగా నటించిన చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ సినిమా “జైలర్” కూడా ఒకటి. 2023లో విడుదలైన జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చింది. రజనీకాంత్ అలా తెరపైకి వచ్చినప్పుడు అభిమానులు పిచ్చివాళ్లయ్యారు. రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిధి పాత్రలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. తమన్నా స్పెషల్ సాంగ్, యోగి బాబు, సునీల్ కామెడీ మొదలైనవి ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. జైలర్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ శుభవార్త అందిస్తూ అధికారిక జైలర్ 2 ప్రకటించారు.
Read Also:BCCI: ఇకపై అలా ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్స్‌లో భారీగా కోత పడనుందా?
అయితే ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా పండుగ కానుకగా అయితే ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా సన్ పిక్చర్స్ జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేసింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ సరదాగా సంభాషించుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇంతలో రజనీకాంత్ అకస్మాత్తుగా రౌడీలను వెంబడిస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. తరువాత, రజనీ కోసం వచ్చిన విలన్లపై రజనీ క్షిపణుల వర్షం కురిపించాడు. అనిరుధ్ ఇచ్చిన జైలర్ BGM తో పాటు టీజర్ సాధారణమైనది కాదు. ఈ టీజర్‌లో నెల్సన్, అనిరుధ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
Read Also:Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ టీజర్ తోనే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందనే చెప్పాలి. అయితే ఇందులో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజన్ తో పాటుగా తలైవర్ గాడ్ లెవెల్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో హైలైట్ అయితే వీటికి మించి మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లుపోయింది. దీనితో ఈ స్కోర్ కోసం అనిరుధ్ అప్పుడు జైలర్ సమయంలో ఎంత టాపిక్ గా నిలిచిందో.. మళ్లీ అంతే రేంజ్ లో అనిరుధ్ వర్క్ వినిపిస్తోంది. మొత్తానికి మళ్లీ అనిరుధ్ తాండవం మొదలైందనే చెప్పాలి.