Wipro: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం విప్రో.. వారికి మాత్రమే మినహాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wipro: టెక్ దిగ్గజం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు మండిపోతున్నాయి. ఆదాయం చాలక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇక వేతన జీవులు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం విప్రో. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. డిసెంబర్ ఒకటిన విప్రో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. అయితే, అధిక జీతాలు తీసుకుంటున్న వాళ్లకు ఈ ఏడాది పెంపులు ఉండబోవంటూ అంతర్గత ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపింది విప్రో. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు మినహాయింపు ఇచ్చింది. వాళ్లకు యథావిధిగా డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయి.
Read Also: Israel-Hamas War: వెస్ట్ బ్యాంక్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి..
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
సాధారణంగా టాప్ పెర్ఫార్మర్లకు జీతాల్లో అధిక పెంపు ఇస్తూ వస్తుంది విప్రో. అయితే, ఈ సారి సెలక్టీవ్ మెరిట్ సాలరీ ఇంక్రీజ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం తక్కువ వేతనం పొందుతున్న వాళ్లలో అర్హులకు మాత్రమే జీతాల పెంపు ఉంటుంది. అందువల్ల.. అధిక వేతనాలు పొందుతున్న వాళ్లు అద్భుతమైన పనితీరు కనబర్చినా.. జీతాల పెంపు మాత్రం ఉండబోదని స్పష్టం చేసింది విప్రో యాజమాన్యం. గత సెప్టెంబర్ 30 నాటికి విప్రోలో 2 లక్షల 44 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల్లో నాల్గో స్థానంలో ఉంది ఈ సంస్థ. అయితే, ప్రస్తుతం సంస్థ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు క్లయింట్లు ఖర్చు తగ్గించుకుంటున్నారు. మరోవైపు.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అందరికీ జీతాలు పెంచి భారం పెంచుకోవడం సరికాదనే ఆలోచనలో విప్రో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!