చలికాలం మొదలైంది రోజు రోజుకు బాడీలోని వేడి తగ్గిపోతుంది.. అందుకే శరీరం వెచ్చగా ఉండేందుకు ఆహారంలో మార్పు కూడా ఉండాలి.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ సీజన్లో రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో అనేక రకాల పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. ఈ ఆరోగ్యకరమైన వాటిలో బెల్లం ఒకటి. ఇది వేడి కలిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో సంభవించే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.. ఇంకా ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నెయ్యి సూపర్‌ఫుడ్‌గా పేరుగాంచింది. ఇది ఆహార రుచిని పెంపొందిస్తుంది. వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రజలు అనేక రకాలుగా ఆహారంలో నెయ్యిని ఉపయోగిస్తారు. మీరు భోజనం తర్వాత నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది..
తులసి.. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతారు.. ఈ సీజన్ లో వచ్చే ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది.. అంతేకాదు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది..శీతాకాలంలో ప్రజలు తరచుగా దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. దీని నుండి ఉపశమనం పొందడానికి తులసి టీ తాగవచ్చు. దీన్ని చేయడానికి ఒక బాణలిలో నీటిని వేడి చేసి దానికి తులసి ఆకులు, బెల్లం, ఎండుమిర్చి, దాల్చిన చెక్క జోడించండి..
శరీరం వెచ్చగా ఉండాలంటే పసుపు పాలు తాగడం మంచిది. మీరు దానిలో బెల్లం కలిపి కూడా తాగవచ్చు. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది..
శీతాకాలంలో అల్లం తినమని సిఫార్సు చేస్తారు. మీరు తరచుగా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే అల్లం మరియు బెల్లం మిశ్రమాన్ని ఒకసారి ప్రయత్నించండి. ఇది తినడం వల్ల మీకు వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది..
ఉసిరి కూడా మంచిది.. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.. ఈ సీజన్ లో వచ్చే వ్యాధులను నయం చేస్తుంది.. ఇలాంటి వాటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.