Site icon NTV Telugu

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు హైదరాబాద్ లో వైన్స్ బంద్

Wine Shops

Wine Shops

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ షాపులు సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో బంద్ అవుతున్నాయి. అయితే వైన్స్ షాపులు మాత్రమే మూతపడనున్నాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు రోజుల పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లను మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Ayodhya Ram Mandir: డిసెంబరు చివరికల్లా పనులు పూర్తి.. జనవరిలో రామమందిర ప్రాణప్రతిష్ఠ

ఇక, నిమజ్జనం సమయంలో మద్యం తాగి రావద్దని కూడా పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28, 29 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుగనుంది. ఈ నిమజ్జనాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్ బండ్‌కు తరలి వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఆయా ప్రాంతాల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 28 గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం, సెప్టెంబర్‌ 29 ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌- లింగంపల్లి, సికింద్రాబాద్‌- హైదరాబాద్‌, లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య పెద్ద మొత్తంలో 8 రైళ్లు ప్రత్యేక రైళ్లు సేవలందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.

Exit mobile version