Site icon NTV Telugu

Nirmala Sitharaman Budget: పన్ను శ్లాబ్‌పై గుడ్‌న్యూస్ ఉండేనా..?

Nirmala

Nirmala

గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తీపికబురు ఉండొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. అసలు బడ్జెట్ ఎలా ఉండబోతుంది. ఏమైనా తాయిలాలు ఉంటాయా? ఎన్నికల వరాలు ఏమైనా ఉంటాయా? ఎలాంటి ప్రకటన ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Palnadu: పల్నాడు జిల్లా పీసపాడులో టెన్షన్.. టెన్షన్

తాత్కాలిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్యాక్స్‌ స్లాబ్‌ల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్యాక్స్ మినహాయింపులు, టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత సులభతరం చేయొచ్చని భావిస్తున్నారు. బేసిక్ ట్యాక్స్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచొచ్చని సమాచారం. దీంతో చిన్న ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు, దీర్ఘకాలిక పన్ను విధానంతో పాటు వినియోగం, పొదుపు పెంచేందుకు చర్యలను ప్రకటించవచ్చని విశ్లేషకుల అంచనా వేస్తు్నారు. ఇక ప్రజలకు ఉపశమనం కలిగించడానికి గృహ రుణ చెల్లింపు కోసం ప్రత్యేక పన్ను మినహాయింపును కూడా ప్రకటించే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు.

Israel: వైద్యుల వేషధారణలో ఆస్పత్రిలోకి చొరబడి.. మిలిటెంట్లను హతమార్చిన దళాలు

పాత విధానంలో పన్ను స్లాబ్ ఇలా..

3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు
3-6 లక్షల వరకు ఆదాయంపై 5% పన్ను
6-9 లక్షల వరకు ఆదాయంపై 10% పన్ను
9-12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం వడ్డీ
12-15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం వడ్డీ
15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది

Exit mobile version