Haryana: నిన్ను చంద్రయాన్-4లో చంద్రునిపైకి పంపుతా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ తనతో ఉపాధి పనుల గురించి మాట్లాడితే.. ఆమెకు సీఎం వెటకారంగా సమాధానమిచ్చారు. సీఎం. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఓ మహిళ తన గోడు వినిపించగా.. ముఖ్యమంత్రి వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.
Also Read: Andhrapradesh: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
హర్యానాలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని వీడియో తీసి నెట్టింట్లో వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read: G20 Summit: జీ20 సమ్మిట్.. రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఈ వీడియో వైరల్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఆప్ మాట్లాడుతూ, ‘ఉపాధి కల్పించడానికి కర్మాగారాన్ని కోరడమే మహిళ చేసిన ఏకైక నేరం. అలాంటి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి’ అని రాశారు. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. అయితే వైరల్ అవుతున్న వీడియోపై ముఖ్యమంత్రి ఇంకా స్పందించలేదు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈ విషయంపై స్పందించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది.
"अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।"
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt
— AAP (@AamAadmiParty) September 7, 2023
BJP के मुख्यमंत्री की सोच देखिए…
हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके।
इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे।
और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db
— Congress (@INCIndia) September 7, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!