Site icon NTV Telugu

Om Raut : తంతె బూరెల బుట్టలో పడ్డ ఆదిపురుష్ డైరెక్టర్

New Project (78)

New Project (78)

Om Raut : ‘ఆదిపురుష్’ సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాని తెర‌కెక్కించిన ఓంరౌత్.. హీరో ప్రభాస్ కు చెడ్డ పేరు తీసుకొచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమా ఆదిపురుష్ రికార్డులకెక్కింది. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓంరౌత్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడంటూ బాలీవుడ్ మీడియా ఎగతాళి కూడా చేసింది. అయితే ఓంరౌత్ ఈ తీరిక‌ స‌మ‌యంలో ఏం చేస్తున్నాడు? అంటే.. అత‌డు చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓం రౌత్ తదుపరి అజ‌య్ దేవ‌గ‌న్ తో భారీ హిస్టారిక‌ల్ మూవీని తీసేందుకు రెడీ అవుతున్నాడట. ఇందులో హృతిక్ రోషన్ న‌టించాల‌ని దేవ‌గ‌న్ కోరుతున్నారట.

Read Also:ICC WTC Points Table: డ్యామిట్ కథ అడ్డం తిరిగేలా ఉందే.. శ్రీలంకను ఓడించి ఆస్ట్రేలియాకు దెబ్బేసిన దక్షిణాఫ్రికా

ఓంరౌత్‌తో కలిసి 2020 బ్లాక్ బ‌స్టర్ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్‌’లో పనిచేసిన అజయ్ మరో హిస్టారిక‌ల్ సినిమాతో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడు ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా కోసం ఓంరౌత్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు. ఇందులో హీరోగా అజయ్ దేవ‌గ‌న్ న‌టిస్తే, హృతిక్‌ను విలన్‌గా నటింపజేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల ద‌శ‌లో ఉంది. కథాంశం ఫైన‌ల్ కాలేదు. ఓం రౌత్ దీనిపై ప‌ని చేస్తున్నారు. హృతిక్‌కి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ – చరిష్మా ఉందని అజయ్ దేవ్ గన్ భావిస్తున్నాడు. అతడి న‌ట ప్రతిభ తానాజీ ఫ్రాంఛైజీకి క‌లిసొస్తుంద‌ని దేవ‌గ‌న్ అనుకుంటున్నారట. తానాజీ: ది అన్‌సంగ్ వారియర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్రలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. దేవ‌గ‌న్- హృతిక్ ప్రాజెక్ట్ ఓకే అయితే అది అన్‌సంగ్ వారియర్స్ ఫ్రాంచైజీ లో సెకండ్ పార్టుగా ఉంటుంది. తానాజీ విజయం సాధించినప్పటి నుండి అన్‌సంగ్ వారియర్స్ టైటిల్‌ను ఫ్రాంచైజీగా మార్చడానికి దర్శక హీరోలు ఓం రౌత్ – అజయ్ దేవ‌గ‌న్ వెయిట్ చేస్తున్నారు.

Read Also:Jammu Kashmir: కుల్గామ్‌లో ఆయుధాలతో సహా ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు..

Exit mobile version