Om Raut : తంతె బూరెల బుట్టలో పడ్డ ఆదిపురుష్ డైరెక్టర్
- తానాజీ సీక్వెల్ తీస్తున్న ఓం రౌత్
- హీరోగా అజయ్ దేవ్ గన్.. విలన్ గా హృతిక్ రోషన్
- భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om Raut : ‘ఆదిపురుష్’ సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాని తెరకెక్కించిన ఓంరౌత్.. హీరో ప్రభాస్ కు చెడ్డ పేరు తీసుకొచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమా ఆదిపురుష్ రికార్డులకెక్కింది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓంరౌత్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడంటూ బాలీవుడ్ మీడియా ఎగతాళి కూడా చేసింది. అయితే ఓంరౌత్ ఈ తీరిక సమయంలో ఏం చేస్తున్నాడు? అంటే.. అతడు చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓం రౌత్ తదుపరి అజయ్ దేవగన్ తో భారీ హిస్టారికల్ మూవీని తీసేందుకు రెడీ అవుతున్నాడట. ఇందులో హృతిక్ రోషన్ నటించాలని దేవగన్ కోరుతున్నారట.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ఓంరౌత్‌తో కలిసి 2020 బ్లాక్ బస్టర్ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’లో పనిచేసిన అజయ్ మరో హిస్టారికల్ సినిమాతో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడు ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా కోసం ఓంరౌత్ తో కలిసి పని చేస్తున్నాడు. ఇందులో హీరోగా అజయ్ దేవగన్ నటిస్తే, హృతిక్‌ను విలన్‌గా నటింపజేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది. కథాంశం ఫైనల్ కాలేదు. ఓం రౌత్ దీనిపై పని చేస్తున్నారు. హృతిక్‌కి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ – చరిష్మా ఉందని అజయ్ దేవ్ గన్ భావిస్తున్నాడు. అతడి నట ప్రతిభ తానాజీ ఫ్రాంఛైజీకి కలిసొస్తుందని దేవగన్ అనుకుంటున్నారట. తానాజీ: ది అన్‌సంగ్ వారియర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్రలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. దేవగన్- హృతిక్ ప్రాజెక్ట్ ఓకే అయితే అది అన్‌సంగ్ వారియర్స్ ఫ్రాంచైజీ లో సెకండ్ పార్టుగా ఉంటుంది. తానాజీ విజయం సాధించినప్పటి నుండి అన్‌సంగ్ వారియర్స్ టైటిల్‌ను ఫ్రాంచైజీగా మార్చడానికి దర్శక హీరోలు ఓం రౌత్ – అజయ్ దేవగన్ వెయిట్ చేస్తున్నారు.
Read Also:Jammu Kashmir: కుల్గామ్‌లో ఆయుధాలతో సహా ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు..
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!