NTV Telugu Site icon

Khushbu Sundar: పాత ట్వీట్లను తొలగించేదే లేదు.. ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు

Khusbhu

Khusbhu

Khushbu Sundar: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీయండి. ఏ పని లేని కాంగ్రెస్‌కి కనీసం ఇలాగైనా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఖుష్హు కౌంటర్‌ ఇచ్చారు. అయినా మీరు గాంధీతో సమానంగా నిలబెట్టినందుకు కాంగ్రెస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ ఇంటిపేరును ‘దొంగలు’గా పోల్చినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన తర్వాత ఆమె చేసిన పాత ట్వీట్ వైరల్‌గా మారింది. జాతీయ నాయకుడిగా చెప్పుకునే ఆయనతో సమానంగా ఉండేందుకు తగిన పేరు, గౌరవం సంపాదించడం నాకు చాలా ఇష్టమని ఖుష్బు చెప్పింది. అలాగే అవినీతి, దొంగలు అనే పదానికి చాలా తేడా ఉందని పేర్కొంది. అది కేవలం పార్టీ నాయకత్వాన్ని అనుసరించిన చేసిన ట్వీట్‌ అని సమర్థించుకున్నారు.

Read Also: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన

ఖుష్బు కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా చేసిన ట్వీట్‌లో..మోదీ అంటే అవినీతి అని మారుద్ధాం, ఇదే సరైన పోలీక అంటూ ట్వీట్‌ చేశారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కారణంగా జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖుష్బు చేసిన పాత ట్వీట్‌ని షేర్‌ చేసింది. రాహుల్ గాంధీపై కేసు పెట్టిన గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ, ఖుష్బు సుందర్‌పై కేసు వేస్తారా అంటూ కాంగ్రెస్ మద్దతుదారులు ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బు 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 100 చిత్రాలకు పైగా నటించిన నటి, ఖుష్బు సుందర్ మొదట్లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారారు.