NTV Telugu Site icon

Rahul gandhi: ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు

Ckee

Ckee

సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తొలిరోజే కేంద్రంపై ఆరోపణలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మోడీ సర్కార్.. రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..

రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదని… రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదన్నారు. మేం దానిని కాపాడతామని చెప్పారు. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతోందని మీడియాతో రాహుల్‌ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్‌’ వేదికగా కూడా అదే సందేశాన్న ఇచ్చారు.‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్‌, టోల్‌ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని రాహుల్ ట్వీట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: 2.70 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి

ఇంత జరుగుతున్నా.. ప్రధాన మంత్రి మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంతోపాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే లోక్‌సభ తొలి సమావేశాల ప్రారంభం వేళ ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టి లోక్‌సభ ఛాంబర్‌వైపు ప్రదర్శనగా వెళ్లారు.

ఇది కూడా చదవండి: Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు