2000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలలో ప్రకటించింది. దీంతో పాటు వాటిని మార్చుకునేందుకు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా సమయం ఇచ్చింది.. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మరియు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ నోట్లు చలమణిలో ఉండకూడదని గానీ, అవి చెట్లుబాటు కావు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో, 2 వేల నోటు మార్చుకోవడానికి మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.. అయితే, ఇప్పుడు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది.. సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువును సెప్టెంబర్ 30, 2023 తర్వాత పొడిగించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.
Read Also: Hyderabad Rains: హైదరాబాదీలకు అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి గడువును సెప్టెంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా? అని సభలో మరో ప్రశ్న తలెత్తింది. దీనిపై కూడా మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు. మే 19న రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. మరోవైపు.. ఆర్బీఐ ప్రకారం, చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి లేదా మార్పిడి చేయబడ్డాయి. చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు మే 19న ప్రకటించిన రోజున రూ.3.56 లక్షల కోట్లు ఉండగా జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి. తిరిగి వచ్చిన నోట్లలో 87 శాతం ప్రజల తరపున బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఆర్బీఐ తెలిపింది. మిగిలిన 13 శాతం మార్చారు. కాగా, నరేంద్ర మోడీ సర్కార్.. 2000 రూపాయల నోటును నవంబర్ 10, 2016న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత అప్పట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేసింది.. ఆ తర్వాత కొత్త 500 నోటును కూడా తీసుకొచ్చిన విషయం విదితమే.