Site icon NTV Telugu

MS Dhoni : ఇదే చివరి మ్యాచ్.. ఐపీఎల్‌కి వీడ్కోలు పలకనున్న ధోనీ..?

Ms Dhoni Speech

Ms Dhoni Speech

ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

READ MORE: Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం

ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 277 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 5439 పరుగులు చేసి, అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు కాగా, భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. చెన్నైకి ధోనీ 5 సార్లు ట్రోఫీ అందించారు. చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సాధించింది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.. ఈ సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ కొనసాగుతున్నాడు.. గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు..

READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..

ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనీకి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే, అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది. అయితే ధోనీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోని ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అభిమానులకు ఇది ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.

READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు

Exit mobile version