MS Dhoni : ఇదే చివరి మ్యాచ్.. ఐపీఎల్‌కి వీడ్కోలు పలకనున్న ధోనీ..?
- చెన్నైకి ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్
- ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్
- ఐపీఎల్ లో 277 మ్యాచ్ లు ఆడిన ధోనీ
- 5439 రన్స్.. 24 హాఫ్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
READ MORE: Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
Also Read
ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 277 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 5439 పరుగులు చేసి, అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు కాగా, భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. చెన్నైకి ధోనీ 5 సార్లు ట్రోఫీ అందించారు. చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సాధించింది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.. ఈ సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ కొనసాగుతున్నాడు.. గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు..
READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనీకి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే, అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది. అయితే ధోనీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోని ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అభిమానులకు ఇది ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.
READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!