Site icon NTV Telugu

Congress Leader: నాలుక కోసేస్తా.. రాహుల్‌ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించిన కాంగ్రెస్ నేత

Tamil Nadu

Tamil Nadu

Congress Leader: 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.

తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికందన్ ఇలా అన్నారు. “మార్చి 23న సూరత్ కోర్టు న్యాయమూర్తి మా నాయకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. జస్టిస్ హెచ్ వర్మ వినండి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ నాలుక నరికేస్తాం’’ అని మణికందన్ అన్నారు. మణికందన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు దిండిగల్ పోలీసులు తెలిపారు.

Read Also: PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్‌ రైలు ప్రారంభం

గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ర్యాలీలో తన “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది.ఇది ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, అనేక పార్టీలు గాంధీకి మద్దతుగా నిలిచాయి. తన నాయకుడిని దోషిగా నిర్ధారించి, పార్లమెంటుకు అనర్హుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది.

Exit mobile version