Haryana Govt: హర్యానా రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ మిత్రపక్షం జేజేపీ సిద్ధంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా బుధవారం నాడు ప్రకటించారు. అదే సమయంలో విప్‌ను ధిక్కరించి కాషాయ పార్టీ వైపు ఉండమని ఎమ్మెల్యే సహచరులకు హెచ్చరికలు ఆయన జారీ చేశారు. అయితే, గత మార్చిలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌటాలా రాజీనామాలు చేయడంతో.. కొత్తగా నయాబ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాడిన ప్రభుత్వంలో 88 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకున్న ఒకరోజు తర్వాత చౌటాలా ప్రకటన వెల్లడించారు.
Read Also: AP Elections 2024: హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా నగదు తరలింపు.. రూ.8.39 కోట్లు సీజ్
కాగా, జేజేపీ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు దుష్యంత్ చౌటాలా హిసార్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు లేఖ రాస్తాను అని చెప్పుకొచ్చారు. హర్యానాలో ఫిబ్రవరి 2017లో జరిగిన గత ప్రభుత్వం నుంచి ఆరు నెలల్లోపు ఏ ప్రభుత్వంపైనా అవిశ్వాస తీర్మానం పెట్టరాదని రూల్‌బుక్ నిర్దేశిస్తోందన్నారు.. దాని ప్రకారం, సీఎం నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని లేదా వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దుష్యంత్ చౌటాలా డిమాండ్ చేశారు.
Read Also: KCR: నేడు కరీంనగర్‌లో కేసీఆర్ రోడ్ షో.. తెలంగాణచౌక్ వరకు ర్యాలీ
ఇక, సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడు మెజారిటీకి రెండు సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ తన ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ వెల్లడించారు. కాగా, అక్టోబర్‌లో హర్యానాలో రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. సాంకేతికంగా బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతానికి సురక్షితంగా కనిపిస్తున్నప్పటికీ, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు ఉపసంహరించుకోవడం లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. మే 25న రాష్ట్రంలో ఐదవ దశలో ఓటింగ్ జరగనుంది. 2019లో గెలిచిన మొత్తం 10 సీట్లను నిలబెట్టుకోవడం బీజేపీకి సవాలుగా మారింది.
