Site icon NTV Telugu

Hyderabad: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. బీర్ బాటిల్స్ తో దాడి.. చనిపోయాడనుకొని..

Husband

Husband

ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్‌ చేసింది. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, యువకులతో బీర్‌బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు.

Also Read:Ind vs Eng, 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్.. సుందర్-జడేజా చారిత్రాత్మక ఇన్నింగ్స్

కాసేపటి తర్వాత సృహలోకి వచ్చిన బాధితుడు తీవ్రగాయాలతో తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. బాధితుడు రాందాస్‌ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పియస్ పరిధిలోకి వస్తుందని జీరో ఏఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. బాచుపల్లి పియస్ పరిది రాజీవ్ గృహకల్పలో భార్య భర్తలు నివాసముంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version