Hyderabad Crime: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ లో భర్తను హత్య చేసిన భార్య.. కారణం మాత్రం అది కాదు

  • కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ లో భర్తను హత్య చేసిన భార్య
  • భర్త గొంతు కోసం చంపేసింది
Dead

Dead

నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అయి ఉండొచ్చు అనుకుంటే పొరపాటే.. మరి ఎందుకు చంపేసిందని ఆలోచిస్తున్నారా? అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తలిద్దరు చనిపోదామనుకున్నారు. ఈ క్రమంలో మొదట భర్త గొంతు కోసం చంపేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమ్యకృష్ణ, రామకృష్ణ దంపతులు. వీరు కెపిహెచ్బిలో నివాసముంటున్నారు.

Also Read:Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?

ఆదాయానికి మించి అప్పులు కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భార్య రమ్యకృష్ణ తన భర్త గొంతు కోసి చంపేసింది. తరువాత తాను కూడా గొంతుకోసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన భార్య రమ్యకృష్ణ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.