వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి. ప్రియురాలి కోసం ప్రియుడు, ప్రియుడి కోసం ప్రియురాలు కర్కశులుగా మారుతున్నారు. కట్టుకున్నవారిని, కలకాలం కలిసి వుందామని వచ్చిన వారికి కాటికి పంపుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. భార్యే భర్తను కటతేర్చింది. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడుతో కలిసి భర్తను చంపింది భార్య. గత ఏడాది నవంబరులో జరిగిన హత్య కేసులో మిస్టరీ చేధించిన పోలీసులు అసలు నిందితుల వివరాలు వెల్లడించారు.
Read Also: Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా రైతుల నిరసన.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..
అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం నిర్వహించాడు రవిశంకర్. అదిలాబాద్ కు చెందిన గజానంద్ ను అతని భార్య ఊర్మిళను పనిలో పెట్టుకున్నాడు రవిశంకర్. రవిశంకర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది గజానంద్ భార్య ఊర్మిళ. ఇద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను చంపి వర్మీ కంపోస్టు షెడ్ లో పాతిపెట్టింది భార్య ఊర్మిళ ,ప్రియుడు రవిశంకర్.. గత ఏడాది నవంబరు 23న గజానంద్ ను చంపేసింది భార్య ఊర్మిళ, ప్రియుడు రవిశంకర్. గజానంద్ కనిపించకపోవడంతో హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆ కేసును అంబాజీపేట స్టేషన్ కి బదిలీ చేశారు. రవిశంకర్, ఊర్మిళను అదుపులోకి తీసుకుని విచారించగా వెలుగులోకి వచ్చింది అసలు విషయం. రవిశంకర్, ఊర్మిళ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ.
Read Also: Alluri Sitarama Raju: విప్లవ జ్యోతి… అల్లూరి సీతారామరాజుకి అశ్రునివాళి