Kurnool Crime: క్రైమ్ పెరిగిపోతోంది.. భార్యలను భర్తలు ఓవైపు.. భర్తలను భార్యలు మరోవైపు కాటికి పంపుతున్నారు.. కొన్నిసార్లు తొందరపాటు.. మిరికొన్ని సార్లు వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. దీంతో, కట్టుకున్న భార్య అని చూడకుండా.. భరించే భర్త అని కూడా చూడకుండా.. ఇతరులతో చేతులు కలిపి హత్యలు చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనూ హత్య ఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది.. కానీ, ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలపులను తొలగించి చూస్తే.. వెంకటేష్ మృతదేహం కనిపించింది.. కాగా, ఆస్తి కోసమే భర్తను సరస్వతి హత్య చేసిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, వెంకటేష్ భార్య సరస్వతి పోలీసుల ముందు లొంగిపోయింది.
Read Also: Mass Jathara : అఫీషియల్.. ఆగస్టు 27న మాస్ జాతర రిలీజ్ వాయిదా
