NTV Telugu Site icon

Murder: భర్తను15 ముక్కలుగా నరికి.. సిమెంట్‌తో డ్రమ్ములో సీల్ చేసి ప్రియుడితో జంప్

Meerut

Meerut

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ భార్య చేసిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. హత్య తర్వాత.. ఆ భార్య ప్రియుడితో కలిసి తన భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికింది. ఇద్దరూ కలిసి ఆ ముక్కలను డ్రమ్ములో వేసి సిమెంట్‌లో ప్యాక్ చేశారు. ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచారు. ఈ ఘటన తర్వాత హృదయం లేని భార్య తన ప్రియుడితో కలిసి మనాలికి వెళ్లింది.

READ MORE: Nagpur Violence: నాగ్‌పూర్ హింసలో అరాచకం.. మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి, బట్టలు చింపే యత్నం..

మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మపురి ఇంద్రానగర్ ఫేజ్ 2కి చెందిన సౌరభ్ కుమార్ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని ఏళ్లు బాగానే కలిసి జీవించారు. ఇరు కుటుంబాలు వారి పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇందిరానగర్ ఫేజ్ 1లోని అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. వారికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. వృత్తిరీత్య సౌరభ్ లండన్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లోనే ఒంటరిగా ఉన్న ముస్కాన్‌కు 2019లో మోహిత్ అకా సాహిల్ పరిచయం అయ్యాడు. క్రమంగా వారిద్దరూ స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త తక్కువ కాలంలోనే ప్రేమగా మారింది.

READ MORE: Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..

కాగా.. భర్త సౌరభ్… తన కుమార్తె పుట్టినరోజు జరుపుకోవడానికి లండన్ నుంచి మీరట్ కు వచ్చాడు. తన భార్య, కుమార్తెను సర్‌ప్రైజ్ చేసేందుకు తాను భారత్‌కు వస్తున్నట్లు ముందుగానే చెప్పాలేదు సౌరభ్. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన సౌరభ్‌కు తన భార్య ముస్కాన్‌తో పాటు సాహిల్ కూడా కనిపించాడు. వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి సౌరభ్‌ను హతమార్చారు. సౌరభ్‌ ఫోన్ నుంచి ముస్కాన్ మెసేజ్‌లు పంపుతుండేది. కుటుంబీకులుకు ఎవ్వరికీ అనుమానం రాలేదు.

READ MORE: Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..

కానీ.. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్ మార్చి 4న మిస్సింగ్ అయినట్లుగా పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముస్కాన్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో కథ బయటపడింది. ముస్కాన్ (27), సాహిల్ (25)లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నిజాన్ని రాబట్టారు. మార్చి 4న సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు ఇద్దరూ అంగీకరించారు. ఆ తర్వాత ఇద్దరూ అతని మృతదేహాన్ని ముక్కలుగా చేసి, అవశేషాలను డ్రమ్‌లో ఉంచి, సిమెంట్‌తో ప్యాక్ చేసినట్లు చెప్పారు. అనంతరం ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి మనాలికి వెళ్లారు.