బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్.. హ్యాట్రికి లక్ష్యంగా ఎన్నికలకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Read Also: Kathmandu: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన భారతీయుడు నేపాల్‌లో అరెస్ట్
అయితే, రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. గజ్వేల్ లో ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తానని.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కేసీఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నాడు.
Read Also: Lucknow: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన యువకుడు.. చితకబాదినన కార్యకర్తలు
కామారెడ్డి నియోజక వర్గం ఓ రకంగా భౌగోళికంగా చాలా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని భావించినట్లు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ విజయం సాధించారు. కానీ.. ఈసారి ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు.