Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
- మిస్ ఇండియా జాబితాలో దళిత.. గిరిజన.. ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో రాహుల్ ప్రశ్న
- కుల గణనల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు. కుల గణనల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ… ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు. “90 శాతం మంది ప్రజలు వ్యవస్థలో భాగం కాలేదు. వీరికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నా వ్యవస్థతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందుకే కుల గణన కోరుతున్నాం. కుల గణన తర్వాత ఓబీసీ సెక్షన్ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాకు వివిధ సంఘాల జాబితా కావాలి. మనకు కుల గణన అనేది కేవలం జనాభా గణన మాత్రమే కాదు. విధాన రూపకల్పనకు ఆధారం. కేవలం కుల గణన చేస్తే సరిపోదు.. దేశంలో సంపద ఎలా పంపిణీ అవుతుందో అర్థం చేసుకోవాలి.” అని ఆయన ఉద్ఘాటించారు. బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నారు.
READ MORE:Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ పథకంపై ప్రధాని మోడీ హర్షం..
Also Read
- Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
మిస్ ఇండియా జాబితాను పరిశీలించగా అందులో దళిత, గిరిజన, ఓబీసీ మహిళ లేరన్న విషయం స్పష్టమైందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికీ మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుంది కానీ రైతులు, కూలీల గురించి మాట్లాడదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులాలు, ఉపకులాలు, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించేందుకు దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!