PAN Card Necessary: ప్రస్తుతం పాన్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఏదైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. పాన్ కార్డును ఇంకమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ద్వారా జారీ చేస్తుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా నిర్వహించబడుతుంది. పాన్ కార్డ్ టాక్స్ చెల్లింపులను మాత్రమే కాకుండా మనం చేసే ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది. మనం చేసే ఆస్తి కొనుగోలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇంకా బ్యాంకింగ్ వంటి అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం. ఇవే కాకుండా పాన్ కార్డ్ ఎక్కడ అవసరమో, అది మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఒకసారి చూద్దామా..
Read Also: Vivo T4 5G: అతి త్వరలో అబ్బురపరిచే ఫీచర్స్తో సరికొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకరానున్న వివో
బ్యాంకింగ్ రంగంలో:
పొదుపు, కరెంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరిచేటప్పుడు పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. ఎప్పుడైనా ఒకే రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా ఉపసంహరించుకున్నా కూడా ఇది అవసరం ఉంటుంది. మీరు రుణం లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా బ్యాంకులు మీ ఫైనాన్సియల్ స్టేటస్, CIBIL స్కోర్‌ను తనిఖీ చేయడానికి మీ పాన్ కార్డ్‌ను ఉపయోగిస్తాయి. అలాగే ఇది మీ పొదుపు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల నుండి వచ్చే వడ్డీపై సరైన పన్ను మినహాయింపులను కూడా నిర్ధారిస్తుంది.
ఆస్తిని కొనడానికి, అమ్మడానికి:
రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. మీరు ఒక ఆస్తిని అమ్మడం లేదా కొనుగోలు చేస్తుంటే.. మీ ఆదాయాలు, పన్ను చెల్లింపులను పాన్ కార్డ్ ట్రాక్ చేస్తుంది.
Read Also: Realme P3 5G: 50MP కెమెరా, 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్
స్టాక్ మార్కెట్:
ఒకవేళ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేయాలనుకుంటే, పాన్ కార్డ్ తప్పనిసరి. డీమ్యాట్ ఖాతాను తెరవడానికి, రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన మ్యూచువల్ ఫండ్స్ ను కొనుగోలు చేయడానికి పాన్ కార్డ్ ఖచ్చితంగా అవసరం. పన్ను సంబంధిత సమస్యలను నివారిస్తూ మీ పెట్టుబడులు సరిగ్గా నమోదు చేయబడిందో లేదో కూడా పాన్ కార్డ్ నిర్ధారిస్తుంది.
పన్ను రిటర్నులు దాఖలు:
ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లైతే పాన్ కార్డ్ తప్పనిసరి. ఎందుకంటే, ఇది మీ గుర్తింపును ధృవీకరిస్తుంది. ఇది మీ పన్ను రికార్డులను ట్రాక్ చేస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేయడానికి మీకు మీ పాన్ నంబర్ అవసరం. మీ జీతం లేదా ఇతర ఆదాయం నుండి TDS తీసివేయబడితే వాపసును క్లెయిమ్ చేయడానికి పాన్ కార్డ్ అవసరం. ఒకవేళ ఎవరికైనా పాన్ లేకపోతే మీ ఆధార్ కార్డును ఉపయోగించి ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.