Vivo T4 5G: అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఫీచర్స్, గేమింగ్ ప్రియులకు సంబంధిన ఫోన్లను ఎప్పటికప్పుడు కొత్తగా మొబైల్స్ ను విడుదల చేస్తూ వివో కంపెనీ భారతీయ మార్కెట్ లో తనదైన శైలితో దూసుకెళ్తుంది. ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన కొత్త Vivo T4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది. 2024 ఏడాదిలో వచ్చిన Vivo T3 5Gకు ఇది అప్డేట్ వర్షన్ గా తీసుక రాబోతున్నారు. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్‌ను టీజ్ చేస్తూ భారతదేశంలో అత్యంత భారీ బ్యాటరీ కలిగిన ఫోన్ అంటూ పేర్కొనింది.
Read Also: Realme P3 5G: 50MP కెమెరా, 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్
Vivo T4 5G ఫీచర్ల విషయానికి వస్తే.. లాంచ్‌కు ముందే లీకైన సమాచారాన్ని బట్టి Vivo T4 5G మొబైల్ iQOO Z10 5G ఫోన్‌తో సమానమైన స్పెసిఫికేషన్లతో రాబోతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. ఇందులో 7300mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+, 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతుంది. ఇక మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7s Gen 3 SoC ప్రాసెసర్ ఉపయోగించబడుతుందని తెలుస్తోంది. ఈ మొబైల్ లో 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లతో లభించవచ్చని అంచనా.
Read Also: IPL 2025: ఎంఎస్ ధోనీ ఎన్నిసార్లు డకౌట్ అయ్యాడో తెలుసా?
ఇక కెమెరా సెగ్మెంట్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OISతో), 2MP డెప్త్ సెన్సార్, అలాగే 32MP సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ఇక డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ 7.89mm స్లిమ్ బాడీతో స్టైలిష్ లుక్‌లో రానున్నట్లు సమాచారం. Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఖచ్చితమైన లాంచ్ తేదీ త్వరలో వెలుబడే అవకాశం ఉంది.