West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైనే నెలకొంది.
స్థానిక నేతకే పట్టం…
ఎన్నికల ప్రచార సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే బెంగాలీ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించే ఒక స్థానిక బెంగాలీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. బీజేపీ ప్రభుత్వం వస్తే మాంసాహారంపై నిషేధం విధిస్తుందన్న మమతా బెనర్జీ ప్రచారాన్ని తిప్పికొట్టేలా, కాబోయే ముఖ్యమంత్రి మాంసాహారి అయ్యి ఉంటారని సుకాంత మజుందార్ వ్యాఖ్యానించడం విశేషం.
Also Read
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
సీఎం రేసులో మహిళా నేతలు..
ఈ ఎన్నికల్లో మహిళల భద్రతను బీజేపీ ప్రధానాంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో, ఒక మహిళా నేతను ముఖ్యమంత్రిగా నియమించి తన మహిళా పక్షపాతి ముద్రను మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. సీఎం రేసులో మహిళలతో పాటు పురుషులు కూడా పోటీలో ఉన్నారు.
అగ్నిమిత్ర పాల్: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అగ్నిమిత్ర, అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, మమతా బెనర్జీపై ఆమె చేసే పదునైన విమర్శలు ఆమెను రేసులో ముందుంచాయి.
రూపా గంగూలీ: ‘మహాభారత్’ సీరియల్లో ద్రౌపది పాత్రతో ఇంటింటికీ పరిచయమైన రూపా గంగూలీకి పట్టణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె, సోనార్పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచి బలమైన అభ్యర్థిగా నిలిచారు.
సువేందు అధికారి: మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, తర్వాత ఆమెనే నందిగ్రామ్‌లో ఓడించిన ఘనత సువేందుది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, బలమైన సంస్థాగత నెట్వర్క్ ఆయనకు ప్రధాన బలాలు. అయితే, గతంలో ఆయనపై ఉన్న నారద స్టింగ్ ఆపరేషన్ వంటి ఆరోపణలు ఒక చిన్న ప్రతికూలతగా మారవచ్చు.
దిలీప్ ఘోష్: బెంగాల్లో బీజేపీ వేళ్లూనుకోవడానికి కారణమైన నేతల్లో దిలీప్ ఘోష్ ఒకరు. ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉన్న ఈయన, తన దూకుడు స్వభావంతో పార్టీ కేడర్‌లో మంచి జోష్ నింపుతారు. అయితే, కొన్నిసార్లు ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది.
ఇక ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సమిక్ భట్టాచార్య అందరినీ కలుపుకుని పోయే నేతగా ఆయనకు పేరుంది. తెరవెనుక ఉండి పార్టీ విస్తరణకు కృషి చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇతని పేరు కూడా వినిపిస్తోంది. నరేంద్ర మోదీ అనే “బ్రాండ్”పై నమ్మకంతో బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది. ఢిల్లీలో రేఖా గుప్తాలాగే, బెంగాల్లో కూడా ఒక మహిళకు పట్టం కడతారా? లేక సువేందు అధికారి వంటి పక్కా రాజకీయ నేతను ఎంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఎవరు సీఎం అయినా బెంగాల్ లో చరిత్ర స్పష్టించిన వారిలో ఒకరిగా ఉంటారు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!